RRB NTPC 2024 : దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న RRB NTPC పరీక్షల షెడ్యూల్ త్వరలోనే రానుంది. పరీక్ష తేదీలను ఒకట్రెండు రోజుల్లో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్స్ (RRBs) ప్రకటించబోతోంది. పరీక్ష తేదీల గురించి ఇంకా కచ్చితమైన సమాచారం అందుబాటులో లేకపోయినా 2025 మొదటి త్రైమాసికంలో ఇవి జరగొచ్చని తెలుస్తోంది. RRB NTPC పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించగానే అభ్యర్థులు సంబంధిత RRB ప్రాంతీయ వెబ్‌సైట్‌లను సందర్శించొచ్చు.
షెడ్యూల్‌లో ఏముంటుంది?
- పరీక్ష నిర్వహణ తేదీలు
- పరీక్ష కేంద్రం చిరునామా
- పరీక్ష సమయాల వివరాలు
- అండర్‌గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులకు ప్రత్యేక వివరాలు ఉంటాయి.
అభ్యర్థులు వీటిని తక్షణమే పరిశీలించి తమ ప్రిపరేషన్‌ను సక్రమంగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.
RRB NTPC 2024 అడ్మిట్ కార్డ్
RRB NTPC అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యేందుకు అడ్మిట్ కార్డ్ కలిగి ఉండటం ముఖ్యం. ఇది లేకుండా పరీక్షా కేంద్రంలో ప్రవేశం కల్పించరు. ఇందులో పరీక్ష తేదీ, సమయం, సెంటర్ చిరునామా, అభ్యర్థుల వివరాలు, ఫొటో, సంతకం ఉంటాయి.
తప్పనిసరిగా పాటించాల్సినవి..
- అడ్మిట్ కార్డ్ వివరాలను కచ్చితంగా పరిశీలించాలి.
- ఏవైనా పొరపాట్లు ఉంటే సంబంధిత RRB అధికారులకు వెంటనే తెలియజేయాలి.
- పరీక్షలు అయిపోయేంత వరకు, ఆ తర్వాత అడ్మిట్ కార్డ్‌ను సురక్షితంగా ఉంచుకోవాలి.
ఎగ్జామ్ సెంటర్ సమాచారం స్లిప్
షెడ్యూల్ ప్రకటన తర్వాత అడ్మిట్ కార్డ్‌కు ముందు అభ్యర్థులకు పరీక్ష సెంటర్ సమాచారం స్లిప్ అందుబాటులో ఉంటుంది. ఇది అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రం ఉండే ప్రదేశాన్ని ముందుగానే తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ స్లిప్ పరీక్ష తేదీకి సుమారు 10 రోజులు ముందుగానే అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులకు ప్రయాణ ఏర్పాట్లకు అనువుగా దీన్ని ముందుగానే ప్రకటించనున్నారు. దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి RRB అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాలి.
రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఉపయోగించి స్లిప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి.
దేశవ్యాప్తంగా 11,558 పోస్టులు
RRB NTPC నియామకాల ద్వారా దేశవ్యాప్తంగా 11,558 ఖాళీలు భర్తీ కానున్నాయి. ఈ పోస్టులు వివిధ రైల్వే జోన్లలో ఉన్నాయి, అండర్‌గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ స్థాయి అభ్యర్థులకు వీటిలో అవకాశాలు ఉన్నాయి. గ్రూప్ D నుంచి గ్రూప్ C పోస్టుల వరకు వివిధ విభాగాల్లో నియామకాలు జరగనున్నాయి.
అభ్యుర్థులు.. లక్షలాది మంది
RRB NTPC పరీక్షలను లక్షలాది మంది అభ్యర్థులు రాయనున్నారు. ఈ పరీక్ష రెండు దశల్లో ఉంటుంది. CBT-1, CBT-2, స్కిల్ టెస్ట్/డాక్యుమెంట్ తదితర అంశాల వెరిఫికేషన్ ఉంటుంది.