దేవుడు వరమందిస్తే | 6 Teens Devudu Varamandiste

0
2
Devudu Varamandiste song lyrics Telugu

పాట వివరాలు

  • సినిమా: 6 Teens
  • సంగీతం: Ghantadi Krishna
  • రచయిత: Suddala Ashok Teja
  • గానం: Kumar Sanu

Devudu Varamandiste song lyrics Telugu

దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే
దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే
ఆ నిద్దరలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే ||దేవుడు||
ఓ కాశ్మీరులో కనబడుతుందా నీ నడకల్లోని అందం
తాజ్‌మహల్‌కైనా ఉందా నీ నగవుల్లోని చందం
నా ఊపిరి చిరునామా నువ్వే ||దేవుడు||

మనసు నిన్ను చూస్తూనే నన్ను మరచిపోయిందే
మాటైనా వినకుండా నిన్ను చేరమంటుందే
నా మనసు నిన్ను చూస్తూనే నన్ను మరచిపోయిందే
మాటైనా వినకుండా నిన్ను చేరమంటుందే
నిను మేఘాన ఒక బొమ్మ గావించగా
నే మలిచాను హరివిల్లునే కుంచెగా
ఈ చిరుగాలితో చెప్పనా
నీ మదినిండ నేనుండగా ||దేవుడు||

ఏడడుగులు నడవాలంటూ నా అడుగులు పరుగిడినా
కొంగుముడిని వేయాలంటూ నిన్ను వేడుకుంటున్నా
ఆ ఏడడుగులు నడవాలంటూ నా అడుగులు పరుగిడినా
కొంగుముడిని వేయాలంటూ నిన్ను వేడుకుంటున్నా
నా కలలన్ని నీ కనులు చూడాలని
బతిమాలాను నీ కంటిలో పాపని
మన్నించేసి నా మనసునీ
ప్రసాదించు నీ ప్రేమనీ ||దేవుడు||నే నిన్నే కోరుకుంటాలే..


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here