ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి (oka radha iddaru krishnula pelli) లోని “చిలకా చిలకా” పాట అప్పట్లో మంచి మెలోడీ హిట్‌గా నిలిచింది. ప్రేమ భావాలను మధురంగా వ్యక్తపరిచే ఈ పాటకు చక్రి సంగీతం అందించగా, కందికొండ సాహిత్యం రాశారు.
Chilaka Chilaka Chilaka
చిలకా చిలకా చిలకా
చిలకా చిలకా చిలకా..
చిరునవ్వుల నా శశిరేఖా..
హా.. చిలకా చిలకా చిలకా..
చిరునవ్వుల నా శశిరేఖా..
ఎన్నడు ఎరుగని వరస
మొదలయినది గుండెల వెనుక
నాకూడా నీలా గే..
అవుతుందిలే ఇప్పుడే..
ఏదోలా అయ్యిందే మనసంతా ఇందాకే..
ఏమైనా ఈ వింత బాగుందిలే..
చిలకా చిలకా చిలకా..
చిరునవ్వుల నా శశిరేఖా..
ఎన్నడు ఎరుగని వరస
మొదలయినది గుండెల వెనుక
చరణం – 1
మనసే త్వరపడి..
నీతో ముడిపడి..
మనసే త్వరపడి నీతో ముడిపడి
పోయిందిగా.. చేసేదేముందికా..
కనులకి కనపడి ఎదురే నిలపడి
అందవు కదా.. నిన్ను చేరేదెలా..
కొత్తగున్నది కొంటెరికం
తీపి బాధలో ఉంది సుఖం
హాయిగున్నది తీపి జ్వరం
జరుపుకుందామా స్వయంవరం
ఆ గాలి సోకిందో మరి అల్లరవుతోంది..
ఆ మాయ జరిగిందో మది ఆగనంటుంది..
నిన్న మొన్నలా లేదు ఈ లాహిరి..
చిలకా చిలకా చిలకా..
చిరునవ్వుల నా శశిరేఖా..
ఎన్నడు ఎరుగని వరస
మొదలయినది గుండెల వెనుక
చరణం – 2
మువ్వల చిరుసడి..
చిలిపిగా వినపడి..
హా మువ్వల చిరుసడి
చిలిపిగా వినపడి..
నను పిలవగా.. నిదరేరదుగా..
పెదవులపై పడి ఆరిన నిజమిది
చెప్పేదెలా.. అలా చూస్తే ఎలా..
వేగమవుతుంది గుండె లయ
దాహమేస్తుంది సఖి ప్రియా
ఏదో జరిగిందీ కొత్త క్రియ
ఏంటో తేల్చేసి చెప్పు ప్రియా..
ఇది బహుశా ప్రేమేమో
మనలో చేరిందేమో
నిను నన్ను కలిపేసి
కలలో ముంచిందేమో…
ప్రేమున్న ప్రతి చోటు మన చిరునామా..
చిలకా చిలకా చిలకా..
చిరునవ్వుల నా శశిరేఖా..
ఎన్నడు ఎరుగని వరస
మొదలయినది గుండెల వెనుక..
పాట వివరాలు
- చిత్రం: ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి
- సంగీతం: చక్రి
- సాహిత్యం: కందికొండ
- గానం: కుమార్ సాను, శ్రేయా ఘోషల్
- నటీనటులు: శ్రీకాంత్, ప్రభుదేవా, నమిత
- దర్శకత్వం: జి. నాగేశ్వర రెడ్డి
- నిర్మాత: జి. నాగేశ్వర రెడ్డి
- విడుదల తేది: 05-09-2003
ఈ పాటలోని మెలోడీ, శ్రేయా ఘోషల్ స్వరం, చక్రి ట్యూనింగ్ ఇప్పటికీ సంగీత అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

