ముంబై వేదికగా గ్రాండ్‌గా లాంచ్.. యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్
బుచ్చిబాబు మార్క్ ఎలివేషన్స్.. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి ‘పెద్ది’
Ram Charan Peddi Trailer Release | యావత్ భారతదేశ చలనచిత్ర రంగాన్ని తనవైపు తిప్పుకునేలా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ రస్టిక్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ అధికారిక ట్రైలర్ విడుదలైంది. శనివారం ముంబై వేదికగా జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్‌లో విడుదలైన ఈ సరికొత్త ప్రమోషనల్ వీడియో, అంచనాలను మించి సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. యూట్యూబ్‌లో విడుదలైన కొద్ది నిమిషాల్లోనే లక్షల్లో వ్యూస్ సాధిస్తూ ఇంటర్నెట్‌ను ఈ ట్రైలర్ పూర్తిగా షేక్ చేస్తోంది.
రామ్ చరణ్ పవర్‌ఫుల్ డైలాగులు
ఈ చిత్ర ట్రైలర్‌లో రామ్ చరణ్ పలికిన డైలాగులు థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా “మీరు అందరూ నేను ఆడాను అనుకున్నారు.. నేను పోరాడాను సారు..” అంటూ చరణ్ గంభీరమైన స్వరంతో చెప్పిన సంభాషణ వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. యాక్షన్ సన్నివేశాలలో చరణ్ చూపిన రౌద్రం, దానికి తోడు ఆయన చెప్పిన “అది నా పొగరు..” అనే రస్టిక్ డైలాగ్ అభిమానుల చేత ఈలలు వేయిస్తోంది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఆయన నటన కెరీర్‌లోనే ఒక సరికొత్త రికార్డును సృష్టించబోతోందని ఈ దృश్యాలు నిరూపిస్తున్నాయి.
Peddi Trailer : గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ‘పెద్ది’ ఎలివేషన్ సీన్స్
ట్రైలర్‌లో హీరో క్యారెక్టర్‌ను ఎలివేట్ చేస్తూ వచ్చే సన్నివేశాలు, డైలాగులు అత్యంత అద్భుతంగా ఉన్నాయి. “నా ఫేవరెట్ క్రికెటర్ పెద్ది సార్.. నా ఫేవరెట్ రన్నర్ పెద్ది సార్.. నా ఫేవరెట్ రెజ్లర్ పెద్ది సార్..” అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే సంభాషణలు కథలోని తీవ్రతను, హీరో పాత్రకున్న పవర్‌ను కళ్లకు కట్టాయి. ఒకే పాత్రలో విభిన్న క్రీడల నేపథ్యంలో చరణ్ చూపిన శారీరక దృఢత్వం (Physical Transformation), ఆయన పడిన శ్రమ ప్రతి ఫ్రేమ్‌లోనూ స్పష్టంగా కనిపిస్తూ విస్మయానికి గురిచేస్తోంది.
నటీనటుల పర్ఫార్మెన్స్ – చిత్రానికి ప్రధాన అసెట్
- శివ రాజ్‌కుమార్, జగపతి బాబు: ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ (గౌరినాయుడు పాత్రలో), వెర్సటైల్ నటుడు జగపతి బాబు (అప్పలసూరి పాత్రలో) పోషించిన పాత్రలు చిత్రానికి ఒక పెద్ద అసెట్‌గా మారాయి. వీరిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్, ముఖకవళికలు, నటన నెక్స్ట్ లెవెల్‌లో ఉండి సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి.
- జాన్వీ కపూర్ (అచ్చియమ్మ): బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తన అద్భుతమైన గ్లామరస్ లుక్స్‌తో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. పల్లెటూరి సాంప్రదాయ రూపంలో ఆమె చూపిన అందం ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. దివ్యేందు (రాంబుజ్జి పాత్రలో) నెగటివ్ షేడ్స్‌తో ఆకట్టుకోనున్నారు.
ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యాజిక్: ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ఈ యాక్షన్ డ్రామాను మరో స్థాయికి తీసుకెళ్లింది. తెలుగు సినిమాల్లో రెహమాన్ సంగీతం అందించడం ఒక అరుదైన విషయంగా నిలిచింది.
కథ వెనుక ‘బుచ్చిబాబు’ సుదీర్ఘ శ్రమ.. గాయపడినా తగ్గని చరణ్!
‘పుష్ప’ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు సానా, ‘ఉప్పెన’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రెండేళ్లు స్క్రిప్ట్ వర్క్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘రూరల్, ఎమోషనల్ అండ్ రస్టిక్ జర్నీ’గా వర్ణించిన ‘పెద్ది’ షూటింగ్ 2024 నవంబర్‌లో ప్రారంభమై, ఇటీవలే 2026 ఏప్రిల్‌లో పూర్తయింది. షూటింగ్ ముగింపు దశలో రామ్ చరణ్ కంటి పైభాగంలో తీవ్ర గాయమై నాలుగు కుట్లు పడినప్పటికీ, బ్రేక్ తీసుకోకుండా షూటింగ్ పూర్తి చేయడం ఆయన నిబద్ధతకు నిదర్శనం.
వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ (2025) ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో, మెగా ఫ్యాన్స్ ఈ ‘పెద్ది’ చిత్రంపైనే భారీ ఆశలు పెట్టుకున్నారు. జూన్ 3న ప్రీమియర్స్, జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ ఎత్తున విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల బ్లాక్‌బస్టర్ నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

