కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ లిరిక్స్ | తెలుగు మెలోడీ సాంగ్

0
1
Kallo Kalyana Mala Lyrics కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ
  • పాట: కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ
  • చిత్రం: Peddannayya
  • సంగీత దర్శకుడు: Koti
  • సాహిత్యం: Veturi Sundararama Murthy
  • గాయకులు: S. P. Balasubrahmanyam, K. S. Chithra
  • నటీనటులు: Nandamuri Balakrishna, Roja Selvamani, Indraja
  • విడుదల సంవత్సరం: 1997

Kallo Kalyana Mala Lyrics

కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ
కలలే నిజమైన వేళా మనువొక రసలీలా
పరిచయమైనవి పరువాలు
పరవశమైనవి హృదయాలు
కంటికే దీపమై గగనము విడిచెను తారకా

కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ

సిరికోయిల చిలిపి వలపై పాడేనమ్మా
యదలోయలా కనులే కలలై పండెనమ్మా
నిను చేరితే మనసే వయసై పిలిచేనమ్మా
నిదరోయినా సొగసే ఎదురై వలచేనమ్మా

మనసే మనువాడగా.. జతగా పెనవేయగా
ఊర్వసే ప్రేయసై వధువుగ వెలసెను కౌగిట

కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ

సిరిమల్లికా సిగలో వగలే చిలికేనమ్మ
వరమాలిక వలపై వగలే విసిరేనమ్మా
మధుమాసమే మనదై మధువే కురిసేనమ్మ
సుముహూర్తమే శుభమై సుఖమై కుదిరేనమ్మా

జరిగే మన పెళ్ళికి…. జగమే విరి పల్లకి
ఏకమై పోయిన మమతలు వెన్నెల కాయగా

కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ
కలలే నిజమైన వేళా మనువొక రసలీలా


పాట ప్రత్యేకత

Kallo Kalyana Mala పాటలో ప్రేమ, పెళ్లి, అనుబంధం వంటి భావాలను ఎంతో అందంగా చిత్రీకరించారు. కీరవాణి సంగీతం, ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం – చిత్ర గాత్రాలు కలిసి ఈ పాటను ఎప్పటికీ గుర్తుండిపోయే మెలోడీగా నిలిపాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here