Eshwar Songs : Dheem Dhirana Lyrics in Telugu (ఈశ్వర్ సాంగ్స్ లిరిక్స్)
పల్లవి:
ధీం ధిరన ధీం ధిరన..
అందెలు తొడిగిన పదమవనా
ఆశపడి సందడిగా నిన్నే పిలవనా
ధీం ధిరన ధీం ధిరన..
చిందులు నిలుపని పరుగవ్వనా
వెంటపడి తొందరగా నిన్నే కలవనా
రంగుల కల కనపడినా.. రమ్మని నను పిలిచెనా
పొంగిన అలనైపోనా ఎవరాపినా..
ధీం ధిరన ధీం ధిరన..
అందెలు తొడిగిన పదమవ్వనా
ఆశపడి సందడిగా నిన్నే పిలవనా
చరణం 1:
వందేళ్ల వరమా.. అనుబంధాల బలమా
మదిలో మౌనాలు తెలిపే మనవి వినుమా
అందాల వనమా.. సుమగంధాల స్వరమా
అదిరే నీ గుండె బెదురే నిలప తరమా..
తొలిపొద్దు లాంటి నమ్మకమా.. వదలొద్దు నన్ను సంబరమా
కదలొద్దు నువ్వు ఇక ఆగిపో సమయమా..
చెలి సోయగాల నందనమా.. చలి కంచె తెంచుకోవమ్మా
చిగురించుతున్న చిరునవ్వు చెదరదమ్మా..
ధీం ధిరాన ధీం ధిరాన..
అందెలు తొడిగిన పదమవ్వనా.. ఆశపడి సందడిగా నిన్నే పిలవనా
చరణం 2:
ప్రాణాలు నిలిపే నా బంధాల గెలుపా
నీదే నా బతుకు అంతా మొదటి వలపా
నీ వెంట నడిపే గత జన్మల పిలుపా
నీవే లే సొంతమౌతా వెలుకోలుపా..
ఎడబాటు కంట పడనిక.. ఎద చాటునుంటవే చిలక
అలవాటు పడ్డ తడబాటు మరిచిపోవా..
విరహాన్ని తరిమి కొట్టేకా.. సరికొత్త మలుపు తిరిగాకా
మురిపాలు కాస్త శ్రుతి మించి తుళ్లి పడవా..
ముగింపు:
ధీం ధిరాన ధీం ధిరాన..
చిందులు నిలుపని పరుగవ్వనా
వెంటపడి తొందరగా నిన్నే కలవనా..
ధీం ధిరాన ధీం ధిరాన..
అందెలు తొడిగిన పదమవ్వనా
ఆశపడి సందడిగా నిన్నే పిలవనా..
రంగుల కల కనపడినా.. రమ్మని నను పిలిచెనా
పొంగిన అలనైపోనా ఎవరాపినా..
ధీం ధిరాన.. ధీం ధిరాన.. ధీం ధిరాన..

