కళ్లలోన నిను దాచానే కన్నమ్మ సాంగ్ లిరిక్స్ | Kallalona Ninu Dachane Song Lyrics in Telugu

0
3
Kallalona Ninu Dachane Song Lyrics in Telugu

చిత్రం & పాట వివరాలు (Song Overview)

  • గానం: ఉన్నీమీనన్​
  • చిత్రం: ప్రేయసి నన్ను ప్రేమించు (Preyasi Nannu Preminchu – 2000)
  • పాట: కళ్లలోన నిను దాచానే కన్నమ్మ (Kallalona Ninu Dachane)
  • సంగీతం: S.A. రాజ్‌కుమార్
  • సాహిత్యం: భువనచంద్ర

ప‌ల్ల‌వి :

కళ్ళలోనా నిను దాచానే కన్నమ్మా
కను రెప్పలనైనా మూయగ లేనే చిలకమ్మా..ఆ
కను రెప్పల నీడల కాపురముండవె చిట్టమ్మా
అరె నీవుంటే సంతోషం.. నీవేగా నా ప్రాణం
నీ వాడే పలుకుల్లో ఉన్నాదే సంగీతం
నీ పువ్వు లాంటి నవ్వులు చాలే చంద్రముఖీ
నువు లేనినాడు నేనూ లేనే ప్రాణసఖి

చ‌ర‌ణం -1

నిజం నేస్తమా ప్రియ రాగమా
నిన్ను చూసి నన్నే మరిచానులే
అదేం మోహమూ అదేం రాగమో
నువు లేని నిమిషం యుగమాయనే..
ఎడారంటి గుండెల్లో వలపు వాన కురిసిందే
నీ వెచ్చని వెచ్చని ఉపిరిలోనా జీవితముంది సఖి
నీ అందెలు చేసే సవ్వడులే నా ఆశలు స్నేహమయి..

కళ్ళలోనా నిను దాచానే కన్నమ్మా
కను రెప్పలనైనా మూయగ లేనే చిలకమ్మ..
కను రెప్పల నీడల కాపురముద్దావే చిట్టమ్మ చరణం 2

చ‌ర‌ణం -2

స్వాతి మేఘమా.. ఇంత మౌనమా..
నా ప్రాణమంతా నీదే సుమా
మనో వీణనూ పలికించనా
జడలోని పువ్వై గుభాలించనా..
కళ్లలోని కల లాగా ఒడిని చేరు ప్రియురాల
నీ కలల్లోనా వెలుగై కలకాలం ఉంటానే
తియ తియని ఊహల పల్లకిలో నిను ఎత్తుకుపోతానే

ప‌ల్ల‌వి:

కళ్ళలోనా నిను దాచానే కన్నమ్మా..
కను రెప్పలనైనా మూయగ లేనే చిలకమ్మా..ఆ
కను రెప్పల నీడల కాపురముండవే చిట్టమ్మా
అరె నీవుంటే సంతోషం.. నీవేగా నా ప్రాణం
నీ వాడే పలుకుల్లో ఉన్నాదే సంగీతం
నీ పువ్వు లాంటి నవ్వులు చాలే చంద్రముఖీ
నువ్వు లేని నాడు నేను లేనే ప్రాణసఖి


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here