| అంశం | వివరాలు |
| పాట | నా మనసుకేమయింది (Naa Manasukemaindi) |
| సినిమా | నువ్వే నువ్వే (Nuvve Nuvve – 2002) |
| సాహిత్యం | సిరివెన్నెల సీతారామశాస్త్రి |
| సంగీతం | కోటి (Koti) |
| గానం | ఉదిత్ నారాయణ్, నిత్యా సంతోషిణి |
| నటీనటులు | తరుణ్, శ్రియ |
| దర్శకత్వం | త్రివిక్రమ్ శ్రీనివాస్ |
Naa Manasukemaindi Lyrics Telugu
అరెరే రేరేరేరే
అరెరే రేరేరేరే
నా మనసుకేమయింది
నాకూ అలాగే ఉంది
ఎన్నో అనాలనుంది దాచేదెలా లోలోపల
మన ఇద్దరికి తెలియంది ఏదో జరిగే ఉంటుంది
అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతు ఉంది
నా మనసుకేమయింది నీ మాయలో
పడింది నిజమా కలా తెలిసేదెలా
చుక్కలే తెచ్చి ఇవ్వనా
అంది నీ మీద నాకున్న ప్రేమ
కొత్తగా ఉంది బొత్తిగా
నమ్మలేనంత ఈ వింత ధీమ
జంటగా వెంట నువ్వుంటే అందదా నాకు ఆ చందమామ
అందుకే నాకు నువ్వంటే
మాటలో చెప్పలేనంత ప్రేమ
పంచుకున్న ముద్దులో ఇలా జతే పడి
పెంచుకున్న మత్తులో పడి మతే చెడి
గాలితో చెప్పనీ మన మొదటి గెలుపు ఇదని
నా మనసుకేమయింది నీ మాయలో పడింది
నిజమా కలా తెలిసేదెలా
ఎప్పుడు గుండె చప్పుడు
కొట్టుకుంటుంది నీ పేరులాగ
ఎప్పుడో అప్పుడప్పుడు
గురుతుకొస్తోంది నా పేరు కొద్దిగా
ఒంటిగా ఉండనివ్వదూ కళ్లలో
ఉన్నా నీ రూపు రేఖ
ఇంతగా నన్ను ఎవరు కమ్ముకోలేదు నీలా ఇలాగ
లోకమంటే ఇద్దరే అదే మనం అని
స్వర్గమంటే ఇక్కడే అంటే సరే అని
వెన్నెలే పాడనీ మన చిలిపి చెలిమి కథని
నా మనసుకేమయింది
ఊ హు హు
నీ మాయలో పడింది
ఊ హు హు
నిజమా కలా
ఊ హు హు
తెలిసేదెలా
ఊ హు హు
మన ఇద్దరికి తెలియంది ఏదో జరిగే ఉంటుంది
అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతు ఉంది.

