Movie Name : Cheppalani Vundi – (2001)
Cast & Crew : Naveen, Raasi, Kanchi Kaul
Singers : SP Balu, Harini
Music : Mani Sharma
Ko Ko Koyilala Ragamlo Lyrics Telugu | Cheppalani Vundi Song
కో కో కో కోయిలల రాగంలో
కో కో కో కొత్త శృతి చేరిందో
కో కో కో కోరికల తాళంలో
కో కో కో కొంటె లయ ఏమందో
కొనగాలి మీటిందేమో ఈడల్లరి
నను చేరి దాటిందేమో నీ ఊపిరి
తొలిసారి సాకిందేమో ఆడావిరి
పొలిమేరె దాటిందేమో జత లాహిరి
కునుకొదిలిన కులుకులు
పిలుపులు తెలుసుకొ
కో కో కో కోయిలలు రాగంలో
కో కో కో కొంటె లయ ఏమందో ..
చరణం 1
అనుకొనే లేదు నిజంగా
నను తాకిన నీ కను సైగ
అణువణువున రగిలిందింకా
ఎంతో మధురంగా
అయినా ఇది అణువంతేగా
అసలెంతో మిగిలిందింకా
మదనుడి కథ మొదలయ్యింది
ఏదీ ఇపుడేగా
కాస్త విసుంగ కాస్త ఖుషీగ
వుంది వింతగా
ఇది అంత సుఖంగ ఎంత చురుగ్గ
రేపుతోంది తీపి తికమక
కో కో కో కోయిలల రాగంలో
కో కో కో కొంటె లయ ఏమందో ..
చరణం 2
హా ………చెలి పైటే చెలగాటంగ
తేరా తీస్తే కాస్త పరాగ్గ
చెడిపోదా చూపు చిరాగ్గా
కైపె ముదరంగా
అలవాటే లేనివిధంగా
అదిమేస్తే ఉన్నపళంగా
మతిపోదా మోహనరంగా
అందం అదరంగా
పెంకితనంగా తెంచకు ఇంకా
వేడి వేడుక..
మొగమాట పడంగా బైటపడంగా
కోడె ఈడు వెంట తరమగా
కో కో కో కోరికల తాళంలో
కో కో కో కొంటె లయ ఏమందో
కో కో కో కోయిలల రాగంలో
కో కో కో కొత్త శృతి చేరిందో
తొలిసారి సాకిందేమో ఆడావిరి
పొలిమేరె దాటిందేమో జత లాహిరి
కొనగోరి మీటిందేమో ఈడల్లరి…
నను చేరి దాటిందేమో నీ ఊపిరి
కునుకొదిలిన కునుకుల
పిలుపులు తెలుసుకొ
కో కో కో కోరికల తాళంలో
కో కో కో కొంటె లయ ఏమందో
కో కో కో కోయిలల రాగంలో
కో కో కో కొత్త శృతి చేరిందో….

