కాలం చెల్లిన మాటలు – హృదయాన్ని తాకే తెలుగు భావ కవిత

0
3
kavithalu

కొన్ని మాటలు కాలంతో పాటు మాయమైపోవు…
అవి జ్ఞాపకాలుగా మనసు మూలల్లో నిశ్శబ్దంగా మిగిలిపోతాయి. “కాలం చెల్లిన మాటలు” అనే ఈ భావ కవితలో రచయిత్రి అనూశ్రీ, గతపు మధురానుభూతులను ఎంతో హృదయానికి హత్తుకునేలా అక్షరాల్లో బంధించారు.

యాంత్రిక జీవితంలో కనుమరుగవుతున్న అనురాగాలు, దూరమైపోయిన పలకరింపులు, తిరిగి రాని జ్ఞాపకాల వెతుకులాటను ఈ కవిత ఎంతో సున్నితంగా ఆవిష్కరిస్తుంది. గతాన్ని తిరిగి తెచ్చుకోలేమని తెలిసినా, ఆ పాత మాటల కోసం మనసు చేసే ఆరాటం ప్రతి ఒక్కరికీ ఎప్పుడో ఒకప్పుడు అనుభూతి అయ్యిందే.

కవిత

నిన్నటి నీడల్లో నిలిచిన జ్ఞాపకంలా..
కాలం చెల్లిన మాట ఒకటి
మనసు గదిలో మిగిలిపోయింది..

అప్పుడు అమృతం కురిపించినదే
ఇప్పుడు ఒట్టి అక్షరమైంది
నాడు ప్రాణం నిలిపిన పలకరింపు,
నేడు అర్థం లేని అలికిడైంది.

వేగమైన యాంత్రిక జీవితంలో
అనురాగాల ఆకులు రాలిన వేళ
వడలిన పువ్వుల సువాసనలకై
ఎంత వెతికినా దొరకవు…

కాలాన్ని వెనక్కి తిప్పలేము..
గతాన్ని మళ్లీ తేలేము..
అయినా అయినా సరే ఆరాటం..
కరిగిపోయే నీటి బుడగలను
చేతిలో పట్టుకోవాలని ఆశపడ్డట్టు..
ఆ పాత మధురాల వెతుకులాట..
కాలం చెల్లిన ఆ మాటలు
ఇక మళ్లీ వినలేమని తెలిసినా..!!

— అనూశ్రీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here