2002లో వచ్చిన ‘కనులు మూసినా నీవాయే’ చిత్రంలోని “చిన్ని నవ్వు చల్లిపోవే” అనే ప్రేమ గీతం ప్రేమికుల మధ్య ఉండే తీపి అలజడిని, అనురాగాన్ని ఎంతో మధురంగా ఆవిష్కరిస్తుంది. మంజుల నాయుడు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి చక్రి అందించిన సంగీతం, ప్రముఖ గాయకుడు హరిహరన్ ఆలపించిన శైలి ఈ పాటకు ప్రత్యేక గుర్తింపునిచ్చాయి.
పాట పూర్తి వివరాలు:
- చిత్రం: కనులు మూసినా నీవాయే (2002)
- నటీనటులు: అర్జన్ బాజ్వా (దీపక్), అర్చన
- గాయకుడు: హరిహరన్
- సంగీతం: చక్రి
- దర్శకత్వం: మంజుల నాయుడు
చిన్ని నవ్వు చల్లిపోవే ప్రియతమా..చందనాలు చిందిపోవే ప్రాణమా..
బిందువై నను తాకిపోవే ప్రియతమా సింధువై మది నిండిపోవే ప్రాణమా
హృదయ వాణివై.. హృదయానివై
అవును నమస్కారం.. కిరణానివై
నా కంటి పాపల్లో.. దీపాల వెలుగై
నా గుండె లోతుల్లో.. స్వప్నాల జడివై
చిన్ని నవ్వు చల్లిపోవే ప్రియతమా
చందనాలు చిందిపోవే ప్రాణమా
నిను చూస్తూ కూర్చుంటే.. ఓ సంబరం సంబరం సంబరం
నా చెంతే ఉన్నట్టు.. ఆ అంబరం అంబరం అంబరం..
నీ రూపు కలలెన్నో.. వెదజల్లి పోయిందీ..
ఎద ఎంటి మేఘంలా.. ఎగిరెల్లి పోతోందీ
చిన్ని నవ్వు చల్లిపోవే ప్రియతమా..
చందనాలు చిందిపోవే ప్రాణమా
ప్రతిరోజు నిదురల్లో.. ఓ కలవరం.. కలవరం కలవరం
కెరటాలై పొంగింది.. మది సాగరం సాగరం సాగరం
మనసేమో చిత్రంగా.. నిన్నేలే అడిగిందీ..
ఎద ఏమో ఆత్రంగా.. నీకోసం వెతికిందీ..
అణువణువును జత చేసి.. నిర్మించా గోపురమే..
నువ్వు చిందే చిరునవ్వే.. నా పాలిట ప్రియ వరమే
నాలోని భావాలు ఇక తెలిపేదేలా..
చిన్ని నవ్వు చల్లిపోవే ప్రియతమా
చందనాలు చిందిపోవే ప్రాణమా
హృదయ వాణివై.. హృదయానివై
కిరణానివై నా కంటి పాపల్లో.. దీపాల వెలుగై
నా గుండె లోతుల్లో.. స్వప్నాల జడివై

