కురిసింది వాన వాన జల్లు కోరగా లిరిక్స్ (Kurisindi Vaana Song Lyrics in Telugu)

0
4
Kurisindi Vaana Song Lyrics in Telugu
  • Kurisindi Vaana Song Lyrics in Telugu
  • Movie: Sankalpam (1995)
  • Singers: SP Balu, Chitra
  • Music: Koti

కురిసింది వాన వాన జల్లు కోరగా..
విరిసింది ప్రేమ ప్రేమ తియ్యతీయగా..
స్వాతి చినుకులే రాలగా ఓ ఓ ఓ..
పూల జల్లుగా మారగా…
అంబరమున తరి మబ్బులు
సంబరముగ పయనించగ
మది నెమలిగ ఆడిందిలే…
కురిసింది వాన వాన జల్లు కోరగా..
విరిసింది ప్రేమ ప్రేమ తియ్యతీయగా..


ఇన్నాళ్ల వలపంతా చిన్నారి తలపంతా
పూచెను కులుకుల కెంపులతో…
నీలోని పులకింత నాలోని గిలిగింత
చిక్కెను జిగిబిగి కౌగిళిలో…
చినుకమ్మా చినుకే..చిత్రంగా చిలికే..
మారాకు తొడిగే..మన ప్రేమా తడకే..
కోరిక మరి చెలరేగగ కోరిన చెలి దరిచేరగ
జరుగును మన కళ్యాణమే…

కురిసింది వాన వాన జల్లు కోరగా…
విరిసింది ప్రేమ ప్రేమ తియ్యతీయగా…


సిరిమల్లె సొగసల్లె జాబిల్లి మనసల్లె
చేరెను ప్రియ సుకుమారముతో…
గోదారి వరదల్లె ప్రాయాల పరవళ్ళు
దూకెను యద సింగారంతో…
వయసంతా వరద..వలపంతా సరదా..
ముద్దీయ వలదా..తొలగింది పరదా..
తీయని కల నిజమైనది
మాయని కథ మనదైనది
జత కూడిన రాగాలతో…

కురిసింది వాన వాన జల్లు కోరగా..
విరిసింది ప్రేమ ప్రేమ తియ్యతీయగా..
స్వాతి చినుకులే రాలగా ఓ ఓ ఓ..
పూల జల్లుగా మారగా…
అంబరమున తరి మబ్బులు
సంబరముగ పయనించగ
మది నెమలిగ ఆడిందిలే…

కురిసింది వాన వాన జల్లు కోరగా..
విరిసింది ప్రేమ ప్రేమ తియ్యతీయగా..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here