Raave SaamrajaVaragamana – Repallelo Radha
రావే సామజవరగమన..
నీలో ప్రేమకు ముడిపడనా..
సాగే హిందోళ ఆలాపన….
పోరా పోకిరి నా మదనా..
నీతో అల్లరి పడగలనా…
ఎద తీరాలకు ఎదురీదనా…..
సందె గాలి చలిగా ఉంది.. చందమామ చెలిగా ఉంది..
లేత చెమట చందనమవుతుందీ….
రావే సామజవరగమన..
నీలో ప్రేమకు ముడిపడనా..
సాగే హిందోళ ఆలాపన….
చరణం-1:
వాలదులే చాలదులే.. పొద్దిక నిన్ను చూడనిదే..
గోదారి పొంగింది… నీ కొంగు జారితే…
వాలకమే తెలిసెనులే.. చూపులు గురి తప్పెనులే..
ఏ వేటకు వచ్చావో….. కన్నె చాటుకి.
ఒకరిలో ఒకరుగా… ఒదిగినా కుదరక….
కలలతో కలిసిపో…….
లాయ్‌లలాయ్ లాయ్ లాయ్ లాయ్..
లాయ్‌లలాయ్ లాయ్ లాయ్ లాయ్..
పోరా పోకిరి నా మదన..
నీతో అల్లరి పడగలనా…
ఎద తీరాలకు ఎదురీదన…
చరణం-2:
ఆకలిని, దప్పికని.. అడగని పరువనపడి,
నిన్నల్లుకుంటున్నాలే….., మల్లె తీగనై.
వేప తిని తీపి అని.. వెర్రిగా నీ వెంట పడి,
వాలి సోలి పోతాలే, తేనెటీగనై…
చినుకులో, చినుకుగా….. వలపుతో వణికినా…..
మనసునే తెలుసుకో….
ముగింపు:
రావే సామజవరగమన.. నీలో ప్రేమకు ముడిపడనా.. సాగే హిందోళ ఆలాపన….
పోరా పోకిరి నా మదన.. నీతో అల్లరి పడగలనా… ఎద తీరాలకు ఎదురీదన…..
సంధె గాలి చలిగా ఉంది.. చందమామ చల్లగా ఉంది..
లేత చెమట చందనమవుతుందీ….

