Prema Deevinchuma Lyrics in Telugu | Full Song Lyrics | Telugu Love Song

0
1
Prema Deevinchuma Lyrics in Telugu

Prema Deevinchuma – Telugu Lyrics

పల్లవి:
ప్రేమా దీవించుమా విడిపోవు వేళలో..
పూవై జీవించుమా విరహాల వేడిలో

ప్రేమా దీవించుమా విడిపోవు వేళలో..
పూవై జీవించుమా విరహాల వేడిలో

కలకాలం మా మదిలో వెలిగేటి దీపమా…
వేటాడే వేదనలో
ఒదార్చగలుగు ఓ దారి చూపుమా…

ప్రేమా దీవించుమా విడిపోవు వేళలో…
పూవై జీవించుమా విరహాల వేడిలో


చరణం 1:

ప్రేమా నీవు లేవా,
నా జన్మే కన్నవారిలో…

ప్రేమా నీవు లేవా,
నను పెంచే వారి ప్రేమలో…

ప్రేమే నేరమంటూ…
అంటావా వారి ప్రేమతో…

ద్వేషం లాగ నీవే…
చేరావా వారి గుండెలో…

ప్రేమకే ఋణమున్నానని…
నా ప్రేమనే బలి అడిగారని…

నా వాళ్ళ కంటి నీటితో ఎదగలేని…
నా ప్రేమబంధమా మన్నించుమా…

ప్రేమా దీవించుమా విడిపోవు వేళలో…
పూవై జీవించుమా విరహాల వేడిలో…


చరణం 2:

కలిసే దారి లేని,
చీకటిలో కైదు చేసినా…

కదిలే వీలు లేని,
సంకెళ్ళే వేసి ఆపినా…

వీచే గాలి పైన,
నా శ్వాసే తనను తాకదా…

పూచే పూల లోన,
తన ఊసే నన్ను చేరదా…

నిన్నలో ప్రతి జ్ఞాపకం…
అది నన్నిలా బ్రతికించే వరం…

ఆ ప్రేమ నాకు అమృతం…
ఐన ఈక్షణం… ఈ నిరీక్షణం తీపే సుమా


ముగింపు:
ప్రేమా దీవించుమా విడిపోవు వేళలో…
పూవై జీవించుమా విరహాల వేడిలో

ప్రేమా దీవించుమా విడిపోవు వేళలో…
పూవై జీవించుమా విరహాల వేడిలో

కలకాలం మా మదిలో
వెలిగేటి దీపమా…

వేటాడే వేదనలో
ఒదార్చగలుగు ఓదార్పు చూపుమా…

ప్రేమా దీవించుమా విడిపోవు వేళలో…
పూవై జీవించుమా విరహాల వేడిలో…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here